ఆహార తనిఖీలేవీ..? | - | Sakshi
Sakshi News home page

ఆహార తనిఖీలేవీ..?

Oct 31 2025 11:42 AM | Updated on Oct 31 2025 11:42 AM

ఆహార తనిఖీలేవీ..?

ఆహార తనిఖీలేవీ..?

● జోరుగా కల్తీ పదార్థాల విక్రయాలు ● ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు ● పట్టించుకోని అధికారులు మొక్కుబడిగా తనిఖీలు ఇన్‌ చార్జి అధికారులే దిక్కు

● జోరుగా కల్తీ పదార్థాల విక్రయాలు ● ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు ● పట్టించుకోని అధికారులు

మెదక్‌ మున్సిపాలిటీ: ఉరుకుల, పరుగుల జీవితంలో అందరు బిజీ అయిపోయారు. ఇంట్లో వంట తయారు చేసుకునే సమయం లేక కొందరు, ఓపిక లేక మరికొందరు ఆహార పదార్థాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఇది జిల్లాలోని కొందరు వ్యాపారులకు వరంగా మారింది. సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా కల్తీ చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, టెస్టింగ్‌ సాల్ట్‌ను ఇష్టానుసారం వాడుతున్నారు.

పుడ్‌ సేఫ్టీ అధికారులు ప్రతి నెల ఆయా హోటళ్లు, దాబాలు, కిరాణ దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలి. నమూనాలు సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపాలి. అయితే జిల్లాలో తనిఖీలు మొక్కుబడి తంతుగా మారాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేపట్టడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నా యి. దీంతో దాబాలు, హోటళ్లు, ఇతర వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

జిల్లా కేంద్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు రెగ్యులర్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారి లేరు. సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన అధికారులే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో నామమాత్రపు తనిఖీలు కొనసాగాయి. ఫలితంగా ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. కుళ్లిన, నిల్వ చేసిన పదార్థాలు విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

కార్యాలయానికి ఎప్పుడూ తాళమే

ఆరునెలల క్రితం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయానికి ఒక గదిని కేటాయించారు. కానీ దానికి ఎప్పుడు చూసినా తాళమే దర్శనమిస్తోంది. అధికారికి ఎప్పుడు ఫోన్‌ చేసినా ఫీల్డ్‌లో ఉన్నానని చెబుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు గదికి తా ళం వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు.

ఉపేక్షించేది లేదు

ఇటీవలే రెగ్యులర్‌ పోస్ట్‌పై జిల్లాకు వచ్చాను. ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, దాబాలలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. కల్తీ పదార్థాలపై ఉపేక్షించేది లేదు. రోజువారీగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఫుడ్‌ సెంటర్లను సీజ్‌ చేస్తాం. ఇప్పటివరకు 11 శాంపిల్స్‌ సేకరించాం.

– స్వదీప్‌, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement