 
															హైవేలపై క్యూఆర్ కోడ్‌లు
● స్కాన్ చేయగానే పూర్తి వివరాలు ● నవంబర్ నెలాఖరులోగా ఏర్పాటు ● భద్రత మెరుగు, అందుబాటులో సమాచారం
రామాయంపేట(మెదక్): జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు భద్రత మెరుగు పర్చడం, ప్రయాణికులకు అత్యవసర సేవలందించడానికి త్వరలో క్యూఆర్ కోడ్‌లతో కూడిన సమాచార బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నేషనల్ హైవే ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సమాయత్తం అవుతోంది. జిల్లా మీదుగా 44వ జాతీయ రహదారి 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈరహదారి పరిధిలో సమీప ఆస్పత్రులు, అత్యవసర నంబర్లు, పెట్రోల్ బంక్‌లు, హైవే పెట్రోలింగ్, పోలీస్‌స్టేషన్లు, రెస్టారెంట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయో తె లియని పరిస్థితుల్లో ప్రయాణికులు తరచూ ఇబ్బందులపాలవుతున్నారు. ఈక్రమంలో ఇబ్బందులను అధిగమించేందుకు క్యూఆర్ కోడ్‌తో పూర్తి సమాచారం అందజేసే విధంగా జాతీయ రహదారుల శాఖ సిద్ధమైంది. వీటిని టోల్ ప్లాజాలు, ట్రక్ లేబై ప్రాంతాలు, ప్రధాన పట్టణాలు, నగరాల ఎంట్రీ రోడ్లు, బస్టాండ్‌లు, హైవే ప్రారంభం, ముగింపు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సర్వీస్ కేంద్రాలు, పెట్రోల్ బంక్‌లు, ఇతర ప్రధాన రహదారుపై ఏర్పాటు చేయనున్నారు.
మూడు భాషల్లో వివరాలు
నవంబర్ నెలాఖరులోగా జాతీయ రహదారి పరిధిలో సదరు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో, వాహనచోదకులకు సులువుగా అర్థం అయ్యే రీతిలో మూడు భాషల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిని ఫోన్‌తో స్కాన్ చేయగానే సంబంధిత రహదారికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్‌లో ప్రత్యక్షమవుతాయి. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎంతగానో తోడ్పడనుంది. దీంతో ప్రయా ణం సాఫీగా కొనసాగే అవకాశం ఉంటుంది. లభించే సమాచారం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
