 
															మొలకెత్తిన ధాన్యం ఆరబెట్టాలి
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్
కొల్చారం(నర్సాపూర్)/తూప్రాన్: వరి కోతలు కోసే విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తొందరపాటుగా వ్యవహరించొద్దని జిల్లా వ్య వసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. గురువారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమశాతం పరిశీలించారు. తడిసిన ధాన్యం మొలకెత్తిందని, ఈ పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని రైతు లు కోరారు. స్పందించిన డీఏఓ వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ మొలకెత్తిన ధాన్యాన్ని ఆరబెట్టాలన్నారు. మరో రెండు, మూడు రోజుల తర్వాత మాత్రమే వరి కోతలు ప్రారంభించాలని తెలిపారు. అక్కడి నుంచి గ్రామంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏఓ శ్వేతకుమారి ఉన్నారు. అనంతరం తూప్రాన్ మండలంలోని జెండాపల్లిలో రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. ఈసందర్భంగా విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
