ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ఆహుతయ్యాక అలర్ట్!
మామూళ్ల మత్తులో
రవాణాశాఖ అధికారులు
పటాన్‌చెరు కేంద్రంగానే ప్రైవేట్ ట్రావెల్స్ కార్యకలాపాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రయాణికుల ప్రాణాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు ఇన్నాళ్లు కళ్లు మూసుకున్నారు. కర్నూలులో వేమూరి కావేరి బస్సు దుర్ఘటన జరిగి 19 మంది ప్రాణాలు పోయాక, ఇప్పుడు తనిఖీల పేరుతో హడావుడి చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శనివారం ముత్తంగి టోల్‌ప్లాజా సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. కాగా పటాన్‌చెరు కేంద్రంగానే ట్రావెల్స్ బస్సులు నడుస్తాయి. వందల సంఖ్యలో నిత్యం ఇక్కడి నుంచే బెంగుళూరు, ముంబై, ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరుతుంటాయి. కర్నూలులో ప్ర మాదానికి గురైన బస్సు కూడా పటాన్‌చెరు నుంచే ప్రారంభమైన విషయం విధితమే. పటాన్‌చెరుతో పాటు, బీరంగూడ, లింగంపల్లి వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటాయి.
రవాణాశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ..
రవాణా శాఖకు సంబంధించి పటాన్‌చెరులోనే రవాణాశాఖ కార్యాలయం ఉంది. మో టార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌తో పాటు, పలువురు సహాయ అధికారులు ఈ కార్యాలయంలో పనిచేస్తుంటారు. వీరు నిత్యం రూట్ చెక్‌లో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేయాలి. కానీ ఈ ఏనాడు ఈ బస్సుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సునే ఉదాహరణగా తీసుకుంటే.. ఈ బస్సు కూర్చుని ప్రయాణించే సీట్లతో మాత్రమే అనుమతి ఉంది. కానీ స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసి నడుపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీన్ని బట్టి చూస్తే ఎన్ని బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో భధ్రతా పరమైన లోపాలతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉండటంతో పాటు, రవాణాశాఖ అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెపుతుంటారనేది బహిరంగ రహస్యం. దీంతో ఈశాఖ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా శనివారం జరిగిన తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొనట్లు తెలిసింది. తమ విధుల్లో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుస్తున్నా కన్నెత్తి చూడని వైనం
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025


