సమస్యలు పరిష్కరించాలి
నర్సాపూర్ రూరల్: నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను జూనియర్ సివిల్ జడ్జి హేమలత శనివారం సందర్శించారు. బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఎలుకలతో పాటు పాములు, ఇతర కీటకాలులోనికి రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు బోధన సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లలితాదేవికి సూచించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన, రుచికరంగా ఉండే భోజనం అందజేయాలని సూచించారు. ఇదిలాఉండగా రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రఘువరణ్ ఆధ్వర్యంలో గురుకులంలో హెల్త్‌క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.


