అమరుల త్యాగాలు వృథా కావు
మెదక్‌మున్సిపాలిటీ: పోలీస్ అమరవీరుల త్యాగాలు వృథా కావని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపొహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. పోలీస్ సిబ్బ ంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం రక్తదానం చేసిన వారిని అభినందించి వారికి పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.
99 యూనిట్ల రక్తం సేకరణ
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 99 యూనిట్ల రక్తం సేకరించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఇందులో 80 యూనిట్ల రక్తం నిలోఫర్ ఆస్పత్రికి, 19 యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంక్‌కు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలకు స్మారకంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిలోఫర్ వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, రక్తదాతలను ఆయన అభినందించారు. కార్య క్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


