ఉద్యోగం ఇవ్వరు.. ఉపాధి చూపరు
‘డీఈఈటీ’ని పట్టించుకోని పరిశ్రమలు
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా డీఈఈటీ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇందులో నమోదు చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కంపెనీల పరిశీలనకు వెళ్లినప్పుడు డీఈఈటీలో తప్పనిసరి నమోదు చేసుకోవా లని యజమానులకు సూచిస్తాం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించి వివరిస్తాం. – ప్రకాశ్,
జీఎం, జిల్లా పరిశ్రమల శాఖ
మెదక్ కలెక్టరేట్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) యాప్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. నిరుద్యోగులు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీల చుట్టూ తిరిగే పనిలేకుండా జాబ్ పొందే అవ కాశం లభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకునేలా నిబంధనలు పెట్టింది. అయితే జిల్లాలో కొన్ని పరిశ్రమలు మాత్రమే నమోదు చేసుకున్నాయి.
ఆసక్తి చూపని పరిశ్రమల నిర్వాహకులు
జిల్లాలో సుమారు 500 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్, ఫోం, సీడ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటివి ఉన్నాయి. అయితే అన్నీ కంపెనీలు తప్పనిసరిగా డీఈఈటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 67 కంపెనీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం యాప్ తీసుకొచ్చి ఏడాది కావొస్తున్నా.. ఇంకా 90 శాతం పరిశ్రమలు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.
వలసపోతున్న యువత
జిల్లాలో వందలాది పరిశ్రమలు ఉన్నా.. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో పరిశ్రమలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారికి కావాల్సిన ఉద్యోగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాయి. డీఈఈటీ యాప్‌లో జిల్లాకు చెందిన 1,951 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం 10 మందికి మాత్రమే అవకాశం కల్పించాయి. జిల్లాకు చెందిన నిరుద్యోగులు హైదరాబాద్‌కు వలస వెళ్లి చాలీచాలని వేతనాలతో నానాఅవస్థలు పడుతున్నారు.
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
1,951 మంది నిరుద్యోగులరిజిస్ట్రేషన్
కేవలం పది మందికే ఉద్యోగం


