
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
జోగిపేట(అందోల్): ఆందోలు మండలంలోని పో తిరెడ్డిపల్లి శివారులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం అందోలు వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మరో ఏడాదిలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఫోర్‌లేన్ రోడ్డు పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఈఈ రవీందర్‌ను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్మించిన రెండు బస్టాప్‌లను పరిశీలించారు. అందోలు ప్రధాన రహదారి వద్ద ఉన్న బురుజు క్రాసింగ్ వద్ద ఇళ్ల తొలగింపుపై ఆర్డీఓ పాండుతో మాట్లాడారు. రోడ్డు విస్తరణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, మంత్రి కూతురు త్రిష, మాజీ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, హరికృష్ణాగౌడ్, మునిపల్లి ఎంపీపీ మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్ ఖాలేద్, మైనార్టీ నాయకుడు చోటూ ఖాన్‌లతో పలువురు పాల్గొన్నారు.
త్వరగా ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలి
వట్‌పల్లి(అందోల్): ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం వట్‌పల్లిలో చేపడుతున్న 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అవసరమైన చోట పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తామని పేర్కొ న్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌జ్యోషి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్‌గౌడ్, వెంకట్‌పాటిల్, ఏఎంసీ డైరెక్టర్ దిగంబర్‌రావు, మాజీ ఎంపీటీసీ నర్సింలు, సుధాకర్‌తో పాటు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ