
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
వెల్దుర్తి(తూప్రాన్): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వే యడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం సాయంత్రం వెల్దుర్తి పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రం, ప్రాథమిక ఆస్పత్రి, బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడగగా, వారు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ బోర్డు నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన బాగుందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. వానాకాలం సీజన్‌కు సరిపడా జిల్లాలో యూరియా అందుబాటులో ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, యూరియాను పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులు ఈ నెల చివరిలోపు ప్రారంభించాలని, లేని పక్షంలో వారి పేరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎంఈఓ యాదగిరి, ఏఓ ఝాన్సీ తదితరులు ఉన్నారు.
29న సమాచార కమిషనర్ల రాక
మెదక్ కలెక్టరేట్: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. గురువారం కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసఫ్ అలీ ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 29న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమా చార కమిషనర్లు జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. జిల్లాలో ఆర్టీఐ పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, రమాదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్