
బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల ప్రగతి
కేక్ కట్ చేస్తున్న పద్మారెడ్డి, నాయకులు
రామాయంపేట(మెదక్): బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రామాయంపేట పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మాట్లాడారు. రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన కేటీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మంత్రిగా ఎన్నో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నా రు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పార్టీ యూత్ విభాగం మండలాధ్యక్షుడు జలంధర్, మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి