
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్‌లో అసంఘటిత రంగ కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం లేబర్ కోడ్‌లను అమల్లోకి తెస్తున్నారని, 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, నాయకులు బాలనర్సు, సాయిలు, శౌకత్ అలీ, హలీమ్, రాజు, కృష్ణ, కుమార్, కొమరయ్య, గట్టయ్య, రెడ్డి, అమృత, బాలమ్మ, రాజు, మల్లేశం, యాదగిరి, కృష్ణ, మైపాల్, షాకీర్ పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా