
వడ్ల కుప్పలు.. రైతు తిప్పలు
మంచి దిగుబడి వచ్చిందని రైతు పొందిన ఆనందం, కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చేసరికే ఆవిరవుతోంది. 15 రోజులుగా పగలంతా ధాన్యం ఆరబెట్టి.. రాత్రయ్యేసరికి కుప్పగా పోయడమే నిత్యం పనవుతోంది. పైగా పగలూ రాత్రీ కాపలా కాయాల్సి వస్తోంది. కంటినిండా నిద్రలేక రోజుల తరబడి జాగారం చేయాల్సి వస్తోంది. విష పురుగులతో ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ‘సాక్షి’ విజిట్ చేయగా పలు అంశాలు వెలుగుచూశాయి. మ్యాచర్ వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేయి తడిపిన వారి ధాన్యం మాత్రం వెంటవెంటనే కొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు వేడుకున్నారు.
– అల్లాదుర్గం(మెదక్)
రోడ్డుపైన ధాన్యం కుప్పలు

వడ్ల కుప్పలు.. రైతు తిప్పలు