
తూకంలో మోసంపై విచారణ
నిజాంపేట(మెదక్): మండలంలోని బచ్చురాజ్‌పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధా న్యం కొనుగోలు కేంద్రంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కేంద్రం నిర్వాహకులు, హ మాలీలు కుమ్మకై తమను మోసగించారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం డీపీఎం మోహన్, డీసీఎస్‌ఓ సురేశ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం జగదీశ్, తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. 42 కిలోలకు బదులు 44 కిలోలు తూకం వేసి తమకు మోసగించారని రైతులు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యురాలిగా కేంద్రం ఇన్‌చార్జి మంజులను గుర్తించిన అధికారులు వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సక్రమంగా ధాన్యం తూకం నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి సస్పెండ్