బడి బాట.. లెక్కల మూట! | - | Sakshi
Sakshi News home page

బడి బాట.. లెక్కల మూట!

May 12 2025 9:32 AM | Updated on May 12 2025 9:32 AM

బడి బ

బడి బాట.. లెక్కల మూట!

ప్రభుత్వ పాఠశాలలపై కుదరని గురి
● మధ్య తరగతి వారు సైతం ప్రైవేటుకే.. ● జిల్లాలో 27 జీరో నమోదు స్కూళ్లు ● భరోసా కల్పిస్తే పెరగనున్న ప్రవేశాలు

ప్రీ ప్రైమరీతో

నమోదు పెరిగే అవకాశం

ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ లేకపోవడంతో చాలా మంది పోషకులు వారి పిల్లలను ప్రైవేట్‌లో చేర్పించి, అక్కడే పైచదువులు కొనసాగిస్తున్నారు. అందుకే విడతల వారీగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. అంగన్‌వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఎల్‌కేజీ స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

పాపన్నపేట(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలల్లో ఫలి తాలు ఘనంగా ఉన్నా.. ప్రవేశాలు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయి. ఏటా ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న బడి బాట.. లెక్కల మూటగానే మారుతుంది. 5వ తరగతి చదివే విద్యార్థులను.. ఆరో తరగతిలో చేర్పించి.. మేం ఇంత మంది ని నమోదు చేశామని టీచర్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రైవేట్‌ బడిలో చదివే విద్యార్థులు, బడి బయట ఉన్న వారు ప్రభుత్వ బడిలో చేరుతు న్న దాఖలాలు లేవు. జిల్లాలో 876 ప్రభుత్వ నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలుండగా, అందులో 61,533 విద్యార్థులున్నారు. కాగా కేవలం 103 ప్రైవేట్‌ పాఠశాలల్లో 39,872 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే 27 ప్రభుత్వ పాఠశాల లు జీరో నమోదుగా ముద్రపడ్డాయి. పరిస్థితి ఇలా గే కొనసాగితే మరో 15 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది.

ఫలితాలు ఘనం.. ప్రవేశాలు అధ్వానం

ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్షక్ష ఫలితాల్లో జిల్లా 96.87 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. కానీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదు. గత మూడేళ్లలో విద్యార్థుల నమోదు 74.99 శాతం నుంచి 67.53 శాతానికి తగ్గింది. ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం 25.01 నుంచి 32.47 శాతానికి పెరిగింది. గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీవీవీల్లో విద్యార్థుల నమోదు పర్వాలేదనిపిస్తుంది.

గణాంకాల మూట..

ఏటా విద్యాశాఖ ఆర్భాటంగా నిర్వహిస్తున్న బడిబాట గణాంకాల మూటగానే మారుతుందన్న విమర్శలున్నాయి. జూన్‌ మొదటి వారంలో ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట నిర్వహిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాలు పంచడం, పదో తరగతి ఫలితాలు చూపడం, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. పాఠశాల తెరవగానే అంగన్‌వాడీ నుంచి 1వ తరగతిలో, సీపీఎస్‌ నుంచి 6వ తరగతిలో చేరే విద్యార్థులను బడిబాటలో కొత్తగా చేరినట్లు లెక్కలు చూపుతున్నారు.

ఇంటింటి సర్వేకు కలెక్టర్‌ ఆదేశం

జూన్‌ 6 నుంచి జరిగే బడిబాటలో ఇంటింటి సర్వే జరపాలని ఇటీవల జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదేశించారు. ఇంట్లో బడీడు కలిగిన విద్యార్థులు ఎంత మంది ఉన్నారు. ఎక్కడ చదువుతున్నారు, చదువుకోని వారు ఎంత మంది అన్న వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి థర్డ్‌ పార్టీ సర్వే కూడా చేయిస్తామని తెలిపారు. అర్హతను అనుసరించి ప్రతి ఒక్కరూ చదువుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థులు పైతరగతి కోసం మరో ప్రభుత్వ బడిలో చేరితే వారిని కొత్తగా నమోదు చేసినట్లు బడిబాట కార్యక్రమంలో చూపడం సరికాదన్నారు. చదువు మానేసిన వారిని, అసలు చదువుకోని వారిని గుర్తించి, వారి అర్హతలను బట్టి చదువుకునే అవకాశాలను కల్పించాలన్నారు. ఇతర పాఠశాలల నుంచి ప్రభుత్వ బడిలో చేర్పించే వారిని మాత్రమే బడిబాటలో చూపాలని ఆదేశించారు.

నమ్మకం పెంచుతాం

సర్కార్‌ బడుల్లో వినూత్న మార్పులు రాబోతున్నాయి. 30కిపైగా విద్యార్థులున్న బడిలో ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. కంప్యూటర్‌ బోధనకు ప్రాధాన్యమిస్తాం. తరచుగా పాఠశాలల మానిటరింగ్‌ చేస్తాం. ఐఎఫ్‌పీ ప్యానల్‌ బోర్డులతో అర్థమయ్యేలా బోధన కొనసాగిస్తాం. ఒత్తిడి లేని చదువులు అందిస్తాం. విద్యార్థులో క్రియేటివిటి పెంపొందిస్తాం. ఆటపాటల్లో ఆరితేరేలా తీర్చిదిద్దుతాం

– రాధాకిషన్‌, డీఈఓ, మెదక్‌

బడి బాట.. లెక్కల మూట!1
1/1

బడి బాట.. లెక్కల మూట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement