ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

May 12 2025 9:32 AM | Updated on May 12 2025 9:32 AM

ఎస్టీ

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఈనెల 15, 16వ తేదీల్లో ఎస్టీ గురుకులాల్లో ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్లు జరుగుతాయని కౌడిపల్లి ఎస్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఫణికుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో 2025– 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 15న కామరెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

ధాన్యం తూకంలో మోసం

నిజాంపేట(మెదక్‌): మండల పరిధిలోని బచ్చురాజ్‌పల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 44 కిలోలు తూకం వేస్తున్నారని ఆదివారం రైతు లు అందోళన నిర్వహించారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ.. తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 4 కిలోల వరకు అదనంగా పెడుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.

మెగా ఉచిత వైద్య శిబిరం

నిజాంపేట(మెదక్‌): మండల పరిధిలోని చల్మెడలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ కమిషనరేట్‌ అడిషనల్‌ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. శిబిరంలో సుమారు 300 మంది మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఐలు సృజన, నారాయణ, ఏఎస్‌ఐ జైపాల్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సైన్యానికి మద్దతుగా నిలుద్దాం

ఎంపీ రఘునందన్‌రావు

దుబ్బాక: ఆపరేషన్‌ సిందూర్‌తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడికి ఆపరేషన్‌ సిందూర్‌తో మన సైనికులు పాక్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్‌–పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. దేశరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరామం లేకుండా పనిచేస్తున్నారన్నారు. దేశరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి మనమంతా అండగా ఉందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

నేత్రపర్వంగా ధ్వజారోహణం

వర్గల్‌(గజ్వేల్‌): పురాతన ప్రాశస్త్యం కలిగిన వర్గల్‌ వేణుగోపాలుని కోవెల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆదివారం గరుడ ధ్వజారోహణ మహోత్సవం నేత్రపర్వం చేసింది. సకల దేవతలకు నవాహ్నిక బ్రహ్మోత్సవ ఆహ్వానం చేరింది. మొదట విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు.

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు  
1
1/3

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు  
2
2/3

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు  
3
3/3

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement