
కార్మిక వ్యతిరేక విధానాలపై ఆందోళన
శివ్వంపేట(నర్సాపూర్): కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సుగుణ ఫుడ్స్ లిమిటెడ్ పరిశ్రమపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఐటీయూ యూనియన్ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. శనివారం పరిశ్రమ ఫీడ్‌మిల్ ఎదుట పలువురు కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. పరిశ్రమలోని పర్మినెంట్ డ్రెవర్లకు డ్యూటీ వేయకుండా ప్రైవేటు వారి కి ఇస్తుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను ఇక్కడ నుంచి ఇతర చోట్లకు బదిలీ చేస్తుండడం పట్ల సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమ కార్మికులు మల్లగౌడ్, సుదర్శన్, యాద గిరి, ఖాసీం, ప్రతాప్, పోచయ్య, తదితరులు ఉన్నారు.