
‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చేసే కుట్ర
హవేళిఘణాపూర్(మెదక్): పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నిర్వీర్యం చేయాలని చూస్తుందని వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి మల్లేశం శనివారం ఆరోపించారు. మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లిలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కవిత, శంకర్, బన్సీ, రమేశ్, కిషన్, పంజి తదితరులు ఉన్నారు.
వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి మల్లేశం