‘నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం’ | - | Sakshi
Sakshi News home page

‘నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం’

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

జన్నారం: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. మండలంలోని కిష్టాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.25 లక్షల వ్యయంతో భోజనశాల భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సమీపంలోని వ్యవసాయ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి బ్యాటరీ సైకిల్‌పై పర్యటించారు. విద్యార్థులకు పాఠ్య, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. తర్వాత కిష్టాపూర్‌, పొనకల్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బక్కయ్య, మండల అభివృద్ధి అధికారి ఉమర్‌ షరీఫ్‌, కస్తూ ర్బా గాంధీ హెచ్‌ఎం శ్రీవాణి, ఐటీఐ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ వై.రమేష్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, వైస్‌ చైర్మన్‌ ఫసిహుల్లా, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర్‌ నందునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement