డీసీపీ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

డీసీపీ ఆకస్మిక తనిఖీ

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ గురువారం హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిసెప్షన్‌, డ్యూటీ అధికారి విభాగం, స్టేషన్‌ రైటర్‌ విభాగం, ప్రాసెస్‌ అప్లికేషన్‌లు, పెండింగ్‌ కేసుల ఫైళ్లు, క్రైమ్‌ రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. నమోదైన కేసులు, దర్యాప్తులో పురోగతి, పెండింగ్‌ వివరాలను సీఐ, ఎస్సైల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌, మంచిర్యాల రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌, హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement