ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేక విక్రయాలు నిలిపివేశాం. మార్కెట్‌లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. చెన్నూర్‌తోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు వందకు పైగా మహిళా వ్యాపారులు ఇక్కడికి వచ్చి కూరగాయల విక్రయాలు చేపడుతుంటారు. మార్కెట్‌కు గేటు, తాగునీరు, పైన రేకులు ఏర్పాటు చేస్తే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– బోగె భారతి, కూరగాయల
వ్యాపారుల సంఘం అధ్యక్షురాలు
ప్రతిపాదనలు పంపించాం..
మార్కెట్‌లో ఫ్లోరింగ్, టాయిలెట్స్ నిర్మాణం పనులు మంత్రి వివేక్‌వెంకటస్వామి సహకారంతో చేపడుతాం. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. మార్కెట్ పక్కనే వాటర్ ట్యాంక్ ఉండడంతో తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశాం. వ్యాపారులు కోరిన విధంగా షెడ్లు కేటాయిస్తాం. ఎవరికి కేటాయించిన షెడ్లకు వారు రక్షణగా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకుంటే సహకరిస్తాం. – మురళీకృష్ణ, మున్సిపల్
కమిషనర్, చెన్నూర్


