చెన్నూర్: గంజాయి కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బుధవారం ఎస్సై శ్యాంపటేల్, సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన నితిన్, క్రాంతి, మైనర్ బాలుడు ఎదుల్లబంధంకు చెందిన దీపక్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారన్నారు. 160 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, 1500 నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలి పారు. బాలుడు నెలరోజుల క్రితం గంజాయికి బా నిస కావడంతో 15 రోజుల పాటు మంచిర్యాలలోని డీఅడిక్షన్ సెంటర్‌కు పంపించామ ని, అతనిలో ఎలాంటి మార్పురాకపోవడంతో కేసు నమోదు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.


