టీజీపల్లెలో రేబీస్‌ కలకలం! | - | Sakshi
Sakshi News home page

టీజీపల్లెలో రేబీస్‌ కలకలం!

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

జన్నారం: మండలంలోని టీజీపల్లెలో రేబీస్‌ వ్యాధి కలకలం రేపుతోంది. వార ం రోజుల క్రితం వ్యాధి సోకిన కుక్క మృతి చెందడంతో పంచాయతీ సిబ్బంది కళేబరాన్ని పూడ్చిపెట్ట కుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుక్క కళేబరాన్ని పాతిపె ట్టకపోవడంతో ఇతర శునకాలు దానిని తిన్నాయని, అనంతరం అవి గేదెలను నాకడంతో వ్యాధి వ్యాప్తిచెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేబీస్‌ లక్షణాలతో బుధవారం రెండు గేదెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రవి అనే రైతుకు చెందిన ఆవుదూడ మృతి చెందగా అనుమానంతో పాతిపెట్టినట్లు చెబుతున్నాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, గ్రామ పాలకులు స్పందించి తగు చ ర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పశువైద్యాధికారి శ్రీకాంత్‌ను సంప్రదించగా రేబీస్‌ సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఇతర శునకాలకుగానీ గేదెలకు గానీ రేబీస్‌ సోకితే 15 రోజుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తాయన్నారు.

గంజాయి విక్రేతలపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై వేర్వేరుగా కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన షేక్‌ షాబీర్‌ మహారాష్ట్రలోని యావత్మాల్‌ నుంచి గంజాయి తీసుకువచ్చి ఆదిలాబాద్‌లో విక్రయిస్తున్నాడు. బుధవారం తనిఖీ చేయగా అతని వద్ద 70 గ్రాముల గంజాయి లభించింది. కేసు నమోదు చేసి డిఅడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మహాలక్ష్మివాడకు చెందిన షేక్‌ మసూద్‌పై ఫిబ్రవరిలో గంజాయి కేసు నమోదైంది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఖానాపూర్‌ చెరువు వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 2 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement