మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. కలెక్టరేట్‌లోని శిశు, మహిళా, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షే మ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మధు సి బ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కొందరు కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. జిల్లా సంక్షేమశాఖలో తనిఖీ ల అనంతరం మధు విలేకరులతో మాట్లాడారు. సంక్షేమశాఖలో పలు అవకతవకలు జరిగినట్లు ఫి ర్యాదులు అందాయని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పా రు. తనిఖీల్లో క్యాష్ బుక్ వినియోగం, దివ్యాంగుల పిటిషన్‌ల పరిశీలన, దివ్యాంగులకు అందజేయాల్సిన వాహనాల పంపిణీలో జాప్యం చేస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. శిశు, మహిళా సంక్షేమం కో సం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మరిన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించాల్సి ఉందని, పరిశీ లన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ, సిబ్బంది ఉన్నారు.


