శాసీ్త్రయ సాగు మేలు | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ సాగు మేలు

May 6 2026 9:19 AM | Updated on May 6 2026 9:19 AM

చెన్నూర్‌: శాసీ్త్రయ వ్యవసాయంతో అధిక ది గుబడి సాధించవచ్చని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. స్థానిక మైనార్టీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రైతు వారంలో భాగంగా ఉద్యానవన పంట లు, ఆయిల్‌పామ్‌ విస్తరణపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు విత్తన కిట్లు అందజేశారు. అనంత రం 100 పడకలు, కేజీబీవీ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలలో చేపట్టిన నూతన భ వనాల పనులను పరిశీలించారు. మండలంలోని సోమన్‌పల్లిలో చేపట్టిన యంగ్‌ ఇండి యా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవ న నిర్మాణాన్ని పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అనిత, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు

భీమారం: నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోళ్లు చేపడతామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మండలంలోని పోలంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement