లక్సెట్టిపేట: రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికా రిణి సహజ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఎర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తే అభివృద్ధి ఉంటుందని, పంట మార్పిడితోనే అధి కదిగుబడితో పాటు ఆదాయం అధికంగా వ స్తుందని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ గెలల ను కంపెనీలు నేరుగా కొనుగోలు చేస్తాయ ని, మధ్యవర్తుల ఇబ్బందులు ఉండవని తెలి పారు. ప్రభుత్వం సాగును ప్రోత్సహిస్తోంద ని, మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి, ఎంపీడీవో సరోజ, ఆత్మ చైర్మన్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


