దండేపల్లి/జన్నారం: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ రా ములు అన్నారు. మంగళవారం ఆయన దండేపల్లి, జన్నారం మండలం పొనకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తేవా లని సూచించారు. నిబంధనల ప్రకారం 41కిలోలు మాత్రమే బస్తా తూకం వేయాలని ని ర్వాహకులకు సూచించారు. లారీ వాళ్లు బస్తా కు రూ.2 నుంచి రూ.5 చొప్పున వసూలు చే స్తున్నారనేది అవాస్తవమని తెలిపారు. జన్నా రం మండలంలోని రాఘవేంద్ర రైస్‌మిల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎస్‌వో బ్రహ్మరావు, దండేపల్లి తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఆర్‌ఐ భూమన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


