అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అభినందనీయం

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

కాసిపేట: మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుంటూ నిరక్షరాస్యులకు చదువు నేర్పడం అభినందనీయమని రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం మండలంలోని లంబాడీతండా గ్రామపంచాయతీలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేయగా ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. వయోజన వి ద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలో 100 రో జుల్లో వందశాతం అక్షరాస్యత కార్యక్రమం ని ర్వహించినట్లు తెలిపారు. వందరోజుల్లో కు ట్టు శిక్షణ పొందుతూ 265 మంది మహిళలు వయోజనులకు విద్య నేర్పించినట్లు పేర్కొ న్నారు. శిక్షణ పొందిన మహిళలు ఉత్తీర్ణులైన 260 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. డెప్యూటీ డైరెక్టర్‌ పురుషోత్తంనా యక్‌, డీఆర్డీవో కిషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాప్రసాద్‌, వయోజన విద్యాశాఖ పీవో శ్రీ నివాస్‌, సర్పంచ్‌ బలరాం, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, డీఆర్పీ శాంకారి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement