అభివృద్ధి పథంలో ధర్మరావుపేట | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో ధర్మరావుపేట

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

● ‘ఇందిరమ్మ’ పైలట్‌ గ్రామంగా ఎంపిక ● ఇప్పటికే అత్యధిక నిర్మాణాలు పూర్తి ● ‘పీఎం అజయ్‌’తో కేంద్రం ప్రోత్సాహం ● ప్రగతిబాటలో ముందుకెళ్తున్న వైనం

దండేపల్లి: మండలంలోని ధర్మరావుపేట గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ పథకం అమలుకు పైలట్‌ గ్రామంగా ఎంపిక చేశారు. ఇళ్లు లేని పేదలకు 104 ఇళ్లు మంజూరు చేయించారు. లబ్ధిదారులంతా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మ క పథకమైన ‘పీఎం అజయ్‌’ కింద కూడా ఈ గ్రా మం ఎంపిక కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చుతుంటే, కేంద్రం పీఎం అజయ్‌ పథకం ద్వారా గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, సామాజికాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంది. ఈ రెండు పథకాల కలయికతో ధర్మరావుపేట గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది.

104 మంజూరు.. 71 పూర్తి

ధర్మరావుపేట గ్రామాన్ని ఇందిరమ్మ పథకంలో పై లట్‌ గ్రామంగా ఎంపిక చేసి 104 ఇళ్లు మంజూరు చే శారు. లబ్ధిదారుల్లో 71 మంది నిర్మాణాలు పూర్తి చే శారు. 66 నిర్మాణాలు స్లాబ్‌ దశ పూర్తి చేసుకున్నా యి. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నవారిలో 30మందికి పైగా లబ్ధిదారులు గృహప్రవేశ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. నిర్మాణాలకు ముందుకురాని ఇళ్లను రద్దు చేసి వాటిని ఇతరులకు కేటా యించారు. దీంతో చాలామంది పేదలు ఇందిరమ్మ పథకం కింద సొంతింటి కల నెరవేర్చుకున్నారు.

గ్రామాభివృద్ధికి ‘పీఎం అజయ్‌’

ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం అజయ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ధర్మరావుపేట గ్రామం పీఎం అజయ్‌ పథకం కింద ఎంపిక కావడంతో ప్రస్తుతం గ్రామాభివృద్ధికి రూ.20లక్షల నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో గ్రామంలో డ్రైనేజీలు, పైపులైన్లు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించారు. గ్రామాన్ని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఎమ్మెల్యే పలుసార్లు సందర్శిచారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

సొంతింటి కల నెరవేరింది

మాకు శిథిలమైన ఇల్లు ఉండేది. దాంట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టి ఇళ్లు మంజూరు చేసింది. మాకూ ఇల్లు మంజూరైంది. దీంతో మేము ఇల్లు కట్టుకున్నాం. గృహప్రవేశం జరుపుకొన్నాం. దీంతో మా సొంతింటి కల నెరవేరింది.

– తేజశ్రీ, ఇందిరమ్మ లబ్ధిదారు

ప్రభుత్వ సహకారంతోనే..

గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు చొరవ చూ పించారు. ఇందిరమ్మ పథకంలో పైలట్‌ గ్రామంగా ఎంపిక చేసి 100కుపైగా ఇళ్లు మంజూరు చేయించారు. ఇప్పటికే 71 ఇళ్లు పూర్తయ్యాయి. నిర్మాణాలకు ముందుకురాని లబ్ధిదారు ల ఇళ్లు రద్దు చేసి కొత్తవారికి కేటాయించారు. పీఎం అజయ్‌ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాం. – కొత్త ధర్మయ్య, సర్పంచ్‌

Advertisement
 
Advertisement
Advertisement