పశువుల అక్రమ రవాణాపై నిఘా | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాపై నిఘా

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝూ ● రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ సందర్శన ● చెన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

కోటపల్లి: బక్రీద్‌ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును మంగళవారం సందర్శించి అధికారులతో మాట్లాడారు. చెక్‌పోస్టు వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో.. లేదో చూడాలని ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాల ని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల ని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పు డూ అ ప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పండుగ సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాల ను గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరా రు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

చెన్నూర్‌: నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ సూచించారు. చెన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు పరిశీలించారు. స్టేసన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనితీరు, స్టేషన్‌ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, గ్రామాల వివరాలను సీఐ బన్సీలాల్‌ ద్వారా తెలుసుకున్నారు. రిసెప్షన్‌ ఇబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణ, పెట్రోలింగ్‌, విజిబుల్‌ పోలీసింగ్‌ను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. మారుమూల గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement