కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

మందమర్రిరూరల్‌/భీమారం/రామకృష్ణాపూర్‌/కోటపల్లి/జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మందమర్రి పట్టణ అధ్యక్షుడిగా మంద తిరుమల్‌రెడ్డి, మండల అధ్యక్షుడిగా కడారి జీవన్‌కుమార్‌, భీమారం మండల అధ్యక్షుడిగా పొడేటి రవి, క్యాతనపల్లి పట్టణ అధ్యక్షుడిగా వొడ్నాల శ్రీనివాస్‌, కోటపల్లి మండల అధ్యక్షుడిగా కాట్రాల గ్రామానికి చెందిన మల్లయ్య, జైపూర్‌ మండల అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్‌ చల్ల విశ్వంబర్‌రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా వారు తమ నియామకంపై మంత్రి వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మంచిర్యాల నగర అధ్యక్షుడిగా నరేశ్‌

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుల నియామకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మంచిర్యాల సిటీ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా తూముల నరేష్‌, లక్సెట్టిపేట పట్టణ అధ్యక్షుడిగా ఎస్‌డి.షాహిద్‌ అలీ, మండల అధ్యక్షుడిగా నలిమేల రాజు, హాజీపూర్‌ మండల అధ్యక్షుడిగా తోట రవి, దండేపల్లి మండల అధ్యక్షుడిగా అక్కల వెంకటేశ్వర్లును నియమించారు.

తూముల నరేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement