బెల్లంపల్లి: వేసవి సెలవుల్లో చిన్నారులు ఏదో ఓ ఆట నేర్చుకోవడానికి తపన పడుతున్నారు. సెల్‌ఫోన్‌లో లభ్యమయ్యే ఆన్‌లైన్ గేమ్‌లను పక్కన పెట్టి పురాతన కాలం నాటి ఆటలపై ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆటలు నేర్చుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన చిన్నారులు ఇంటి ఆవరణలో చెట్ల కింద రోజువారీగా ఉదయం, సాయంత్రం వేళల్లో అష్టాచెమ్మా ఆడుతున్నారు. పిల్లలు ఇళ్లలో టీవీలు చూస్తూ కాలంగడిపే కన్నా పూర్వకాలం నాటి ఆటలు ఆడుతుండటం చూసి తల్లిదండ్రులు మురిసి పోతున్నారు.


