బోథ్: సొనాల మండలంలోని లెండిగూడలో మడావి శ్రీదేవి (14) అనే బాలిక వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడావి మారుతి కుమార్తె శ్రీదేవికి సోమవారం రాత్రి నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వచ్చి ఇంట్లో కుప్పకూలింది. వడదెబ్బతోనే మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు ..
ఆసిఫాబాద్‌రూరల్: రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన మండలంలో ని తుంపెల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తి ర్యాణి మండలం ఓని గిన్నెధారికి చెందిన మడావి రవీందర్ (36) అతని భార్య నర్మదతో కలిసి ఆసిఫాబాద్‌లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా తుంపెల్లి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
పిల్లర్ బాక్సులు మీదపడి మహిళ ..
చింతలమానెపల్లి: ఇందిరమ్మ పథకం కింద నిర్మిస్తున్న ఇంటి పిల్లర్ బాక్సులు మీదపడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోర్సిని గ్రామానికి చెందిన సిడం సుగుణ (47)కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పంచాయతీ కార్యదర్శి తిరుపతి అనధికారికంగా కాంట్రాక్టు తీసుకుని ఇల్లు నిర్మిస్తున్నాడు. మంగళవారం పిల్లర్లకు ఇనుప ప్లేట్లను నిర్మించారు. సాయంత్రం గాలులు వీస్తుండడంతో సుగుణ ఇనుపప్లేట్లు పడకుండా కర్రలు అడ్డుగా పెట్టేందుకు ప్రయత్నించింది. గాలులు బలంగా వీచడంతో ఒక్కసారిగా ఇనుప ప్లేట్ల బాక్సు మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త గతంలోనే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని ఎస్సై జీవన్
పరిశీలించారు.
కారు బోల్తాపడి ఒకరు..
తాండూర్: ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురాకు చెందిన అంబాడే దినేష్ (50), అతని స్నేహితులు రేబావర్ రమేశ్, రేబావర్ మహంకాళి, రేబావర్ సునీతతో కలిసి సోమవారం మంచిర్యాలలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. సాయంత్రం రాజురాకు వెళ్తుండగా వెనుకటైరు పేలడంతో కారు బోల్తా పడింది. ఘటనలో కారు నడుపుతున్న దినేష్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుని కుమారుడు హర్షల్ దినేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ఉట్నూర్‌రూరల్: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గొడ్డలితో దాడి చేసి ఒకరిని హత్య చేసిన సంఘటన మండలంలోని నర్సాపూర్(బీ)లో చోటు చేసుకుంది. ఉట్నూర్ ఎస్సై గుంపుల విజ య్ తెలిపిన వివరాల ప్రకా రం నర్సాపూర్(బీ)కి చెందిన కాంబ్లే చంద్రముని (43) అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరగడంతో సదరు మహిళ భర్త అభినందన్ ఇటీవల భార్యను పుట్టింటికి పంపించాడు. సోమవారం రాత్రి చంద్రముని ఇంటికి వస్తుండగా కక్ష పెంచుకున్న అభినందన్, అ తని మిత్రులు సీతావార్, వాగ్మారే సత్యపాల్, వా గ్మారే మిలింద్, కాంబ్లే యోగిరాజ్, కాంబ్లే రజి నికాంత్, సోన్‌కాంబ్లే కిషోర్, కాంబ్లే రాహుల్‌తో కలి సి గొడ్డలి, కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


