పేపర్‌ క్రాఫ్ట్‌, ఫజిల్స్‌.. | - | Sakshi
Sakshi News home page

పేపర్‌ క్రాఫ్ట్‌, ఫజిల్స్‌..

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

ఆసక్తి పెంపొందుతోంది

ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్లు, టీవీల కు అతుక్కుపోవడంతో వారి ఆలోచనాశక్తి తగ్గు తోంది. వేసవి సెలవుల్లో పేపర్‌క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, గ్రూప్‌ యాక్టివిటి లాటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో ఆసక్తి పెంపొందుతోంది.

– దాస్‌ అపర్ణ, క్రాఫ్ట్‌ టీచర్‌, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం సహజం. సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడంతో మానసిక ఒత్తిడి, అలసట పెరుగుతున్నాయ ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులకు సృజనాత్మక ఆటల ద్వారా ఇస్తున్న శిక్షణ వారిలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు గానూ పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ప్రతీరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పేపర్‌ క్రాఫ్ట్‌, ఆటలు, డ్యాన్సులు, ఫజిల్స్‌, కాగితంతో బొమ్మలను తయారు చేయడం, రంగులతో కళాత్మక చిత్రాలు వేయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సామూహికంగా కూర్చొని ఆటలు ఆడటం ద్వారా చిన్నారుల మధ్య స్నేహభావం, మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి వేసవి శిబిరాలు చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement