నాగోబా ఆలయంలో పీవో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

నాగోబా ఆలయంలో పీవో ప్రత్యేక పూజలు

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

ఇంద్రవెల్లి: నాగోబా ఆలయంలో మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు నాగోబా ప్రతిమను అందించి శాలువాతో సత్కరించారు. నాగోబా ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేస్లాపూర్‌ బాలికల ఆశ్రమ వసతిగృహాన్ని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రా వ్‌, సర్పంచ్‌ మెస్రం తుకారాం, మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్‌ కటోడ, మెస్రం మనోహర్‌, మెస్రం జంగు పాల్గొన్నారు.

తాపీమేస్త్రీ ఆత్మహత్య

రెబ్బెన: మద్యం మత్తులో తాపీమేసీ్త్ర ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల మేరకు రెబ్బెన మండలంలోని గోలేటికి చెందిన తాపీమేస్తీ గజ్జెల్లి అశోక్‌ (35) ఆరేళ్లుగా కుటుంబంతో కలిసి పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని రామయ్యపల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై ఇంట్లో తరచూ భార్యతో గొడవపడేవాడు. గత నెల 30న భార్యతో గొడవపడి గోలేటిలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చి ఉంటున్నాడు. సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. మంగళవారం ఉదయం తలుపులు తీయకపోవడంతో తల్లి ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు తెరిచి చూడగా ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య రమ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement