‘ప్రాణహిత’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

బెల్లంపల్లి: ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలగలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. జగన్నాథపురం, అడ ప్రాజెక్టుల కాలువ నిర్మాణ పనులను గాలికి వదిలేశారన్నారు. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. సమావేశంలో కుమురంభీం జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్‌పాషా, మంచిర్యాల జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్‌, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌, డి.బ్రహ్మానందం, చరణ్‌, మల్లేశ్‌, శ్రీనివాస్‌, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement