నస్పూర్: రైతులు ప్రభుత్వం సిఫారసు చేసిన సన్నరకం వరి సాగు చేయాలని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీతారాంపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు వారోత్సవంంలో ఆయన మాట్లాడారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుందని తెలిపారు. రైతులు అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల నేలలో నాణ్యత తగ్గుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో రశీదు తీసుకోవాలని అన్నారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత, మండల వ్యవసాయ అధికారి మహేందర్, వెటర్నరీ సర్జన్ తిరుపతి పాల్గొన్నారు.


