నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన రాజేశ్వర్ పుట్టుకతో అంధుడు. పదేళ్లుగా తన హక్కు కోసం పోరాడుతున్నాడు. 2015–16 సంవత్సరంలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేపట్టగా, రాజేశ్వర్‌కు మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదు. తనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో చెప్పాలని పదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 80 ఏళ్ల ఆయన తల్లే రాజేశ్వర్‌కు కళ్లుగా మారి.. కొడుకుకు జరిగిన అన్యాయంపై కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. తల్లి బాటలో కొడుకు ఇలా తిరుగుతున్నాడు. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన రాజేశ్వర్ ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


