శ్రీరాంపూర్: సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య(టీజీబీకేఎస్) పేరుతో నూతనంగా సంఘం ఏర్పాటైంది. గోదావరిఖనికి చెందిన టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సోమవారం మేడారం తరలివెళ్లి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద సంఘాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. కార్మికుల పక్షాన పోరాడుతామని, జూన్‌లో గోదావరిఖనిలో మొదటి మహాసభ నిర్వహించి యూనియన్ స్వరూపాన్ని వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పెంచాల తిరుపతి, ముదిగిరి మల్లేశం, దాసరి శంకర్, మండ సంపత్, ప్రేంసింగ్, దేవ శ్రీనివాస్, దాసరి మల్లేశ్, నాగుల మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


