దాగుడు మూత దండాకోర్
బాక్సింగ్ పంచ్.. బ్లాక్..
తైక్వాండోలో తర్ఫీదు
బెల్లంపల్లి నంబర్–2 క్రీడా మైదానంలో శిక్షకుడు బోగ రాజేశ్ మార్గదర్శకంలో చిన్నారులు తైక్వాండోలో తర్ఫీదు తీసుకుంటున్నారు. ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సాధన చేస్తున్నారు. రెండు గంటల శిక్షణ అనంతరం వారు ఇస్తున్న ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శిక్షణకు 25 మంది వరకు చిన్నారులు హాజరవుతుండగా, మరికొందరు ఫుట్‌బాల్ నేర్చుకుంటున్నారు. – బెల్లంపల్లి
వేసవి సెలవుల్లో చిన్నారులు బాక్సింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. బాక్సింగ్ పంచ్.. బ్లాక్ కొట్టేందుకు శిక్షణ పొందుతున్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 31 వరకు ఇవ్వనున్న శిక్షణను14 ఏళ్లలోపు చిన్నారులు సద్వినియో గం చేసుకుంటున్నారు. మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 15 మంది బాక్సింగ్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు. రూ.100 ఫీజుతో నెలరోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు శిక్షకులు తెలిపారు. – మంచిర్యాలటౌన్
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో గ్రామీణ ప్రాంత చిన్నారులు ఇంటివద్ద గోలీలు, వివిధ రకాల ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా చెట్ల నీడలో...ఇళ్లముందు ఉన్న పందిరి కింద గోలీలాడుతూ కనిపిస్తున్నారు. ఆదివారం మండలంలోని అంజీ గ్రామాన్ని ‘సాక్షి’ సందర్శించగా చిన్నారులు ఇలా చెట్టు నీడలో గోలీలాడుతూ కనిపించారు.
– ఇంద్రవెల్లి
డ్రమ్ము పైన ఉన్న నీటిని తాగుతున్న తేనెటీగలు
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి, గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. భరించలేని వేడిమి, వేసవి తాపంతో పిచ్చుకలు, తేనెటీగలు ఇంటి ఆవరణలో నిలిచి ఉన్న నీటిని తాగుతూ, అందులో స్నానం చేస్తూ చల్లబడుతూ ఉపశమనం పొందుతున్నాయి. – మంచిర్యాలఅగ్రికల్చర్
వేసవి సెలవులను చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. పగటిపూట ఎండ తీవ్రతకు బయటకు రాని
చిన్నారులు సాయంత్రం వేళలో దాగుడు మూత దండాకోర్ ఆటలు ఆడుతున్నారు. దస్తురాబాద్‌లోని కమ్మరివాడలో
సరదాగా ఆడుతుండగా
కనిపించారు.
–దస్తురాబాద్


