ఇంద్రవెల్లి: మండలంలోని పొల్లుగూడలో సోమవారం జుగ్నాక్ వంశీయుల పెర్సపేన్ (కులదేవత)కు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జుగ్నాక్ వంశంలో కొత్తగా పెళ్లిళ్లు అయిన కోడళ్లు, ఇప్పటి వరకు దేవత సన్నిధికి రాని కోడళ్లకు భేటింగ్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున పెర్సపేన్ దేవతకు పుణ్యస్నానం చేయించి అదేరోజు రాత్రి ఆలయంలో మహాపూజ నిర్వహించనున్నట్లు జుగ్నాక్ వంశీయులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలన్నారు. జుగ్నాక్ వంశీయుల విన్నపం మేరకు షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కటోడ జుగ్నాక్ మహాదు, జైతు, కాశీరాం, మానిక్‌రావ్, జుగ్నాక్ భరత్, లింబారావ్, కొరెంగా లింగు, జుగాదిరావ్, మర్సుకోల నాందేవ్, తదితరులు పాల్గొన్నారు.


