కంప్యూటర్‌ విద్యపై ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ విద్యపై ఆసక్తి

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

● వేసవి సెలవులు సద్వినియోగం ● శిక్షణకు పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు

చెన్నూర్‌: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు నేడు కంప్యూటర్‌ విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. వేస వి సెలవులు సద్వినియోగం చేసుకునే దిశగా శిక్షణ పొందుతున్నారు. పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు ఉదయం, సాయంత్రం కంప్యూటర్‌ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. చెన్నూర్‌లోని శిక్షణ కేంద్రంలో పట్టణ విద్యార్థులతోపాటు కోటపల్లి, వేమనపల్లి మండలాల నుంచి రాకపోకలు సాగి స్తున్నారు. కంప్యూటర్‌ కోర్సులు సీఎఫ్‌సీ, డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, ట్యాలీతోపాటు టైప్‌రైటింగ్‌లోనూ శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల

శిక్షణ కాలంలో విద్యార్థి పూర్తి స్థాయిలో

కంప్యూటర్‌ శిక్షణ పొందవచ్చని శిక్షకులు

రాజు తెలిపారు.

పరిజ్ఞానం తప్పనిసరి

నాది కోటపల్లి మండలం కొల్లూరు. కంప్యూటర్‌ శిక్షణ కోసం ప్రతీరోజు ఉదయం బ్యాచ్‌ వస్తున్నా. డీటీ పీ నేర్చుకుంటున్నా. ఏఐ వచ్చింది. అయినప్పటికీ కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువులు చదివిన కంప్యూటర్‌ కోర్సులు వచ్చి ఉండాలి.

– జె.రాంచరణ్‌ తేజ, కొల్లూరు

డీసీఏ నేర్చుకుంటున్నా..

మాది చెన్నూర్‌ మండలం కిష్టంపేట. ఇంటర్‌ చదువుతున్నా. ప్రతీరోజు ఉదయం చెన్నూర్‌లోని కంప్యూటర్‌ సెంటర్‌కు వచ్చి డీసీఏలో శిక్షణ పొందుతున్నా. ఇంటర్‌ పూర్తయ్యే వరకు డీటీపీ, పీజీడీసీఏ కోర్సులు పూర్తి చేస్తా. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటున్నాం.

– జి.విజయ్‌కుమార్‌, కిష్టంపేట

Advertisement
 
Advertisement
Advertisement