వేర్వేరుచోట్ల మొక్కజొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరుచోట్ల మొక్కజొన్న పంట దగ్ధం

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

భైంసారూరల్‌: మండలంలోని ఇలేగాంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రైతు పార్వతి సాయినాథ్‌ రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి చేనులోనే కుప్పలుగా ఉంచాడు. ఆదివారం పంటచేను పైనుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి పంటకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు నీళ్లుచల్లి ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.50 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

రాజూరలో..

ఖానాపూర్‌: మండలంలోని రాజూరలో రైతు ఎనుగందుల చిన్నయ్య ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి చేనులోనే కు ప్పగా ఉంచాడు. ఆదివారం ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మ ంటలు చెలరేగడంతో పంటకు నిప్పంటుకుని అర ఎకరానికి పైగా దగ్ధమైంది. ప్రభుత్వం పరిహారం అ ందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

మామడలో...

మామడ: మండల కేంద్రానికి చెందిన కోండ్ర రమేశ్‌ అనే రైతు ఎకరంలో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి చేనులో కుప్పగా పోశాడు. ఆదివారం తెల్లవారుజామున మొక్కజొన్నకు నిప్పుంటుకోవడంతో గమనించిన రైతు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే పంటమొత్తం కాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement