అ‘పూర్వం’ మహా సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వం’ మహా సమ్మేళనం

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ యూపీఎస్‌, ఎంసీడబ్ల్యూఈఈఎస్‌ పాఠశాలలో 1984–2018 వరకు చదివిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఆదివారం కనువిందుగా జరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు తరగతిగదుల్లోకి వెళ్లి అప్పటి మధురానుభూతులు గుర్తు చేసుకున్నారు. అంతకుముందు పాఠశాల ప్రాంగణంలోనే ప్రార్థన చేశారు. అక్కడి నుంచి పటేల్‌ గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు లక్ష్మీకుమారి, పాండురంగారావు, మురళీచంద్రమోహన్‌రావు, కేశవ్‌లాల్‌, జయంతిరాథోడ్‌, అప్పారావు, సీవీరావు, అనుపమలతో పాటు పలువురిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. 1,150 మందికి పైగా విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్న మహా సమ్మేళనానికి భారత్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కింది. భారత్‌ వరల్డ్‌ రికార్డు, వరల్డ్‌ రికార్డు ఆర్గనైజేషన్‌ కోఆర్డినేటర్‌ కేవీ రామనాథ కార్యక్రమ నిర్వాహకులు శాంకరి, గీత, పూర్వ విద్యార్థులకు సర్టిఫికెట్‌ అందజేశారు. – మంచిర్యాలఅర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement