పాతమంచిర్యాల: దేశ కార్మికులకు దిక్సూచి ఐ ఎన్టీయూసీ అని యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐఎన్టీయూసీ ఆవిర్భవించిందని తెలిపారు. 3.30కోట్ల మంది కార్మికులు సభ్యులుగా ఉన్న ఐఎన్టీయూసీ ప్రపంచంలోనే పెద్ద కార్మిక సంఘమని పేర్కొన్నారు. యూనియన్ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చైర్మన్ జనక్‌ప్రసాద్ నాయకత్వంలో తెలంగాణలోని కోటీ 20 లక్షల మంది అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమానికి పోరాడుతున్నారని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు తిరుపతి, చంద్రమౌళి, గుండోజు రమేశ్, శ్రావణ్, శ్రీనివాస్, కుమార్ తదితరులున్నారు.


