ప్రస్తుతం కంపెనీ అస్థిత్వం కోల్పోయే ప్రమాదముంది. కొత్త గనులు లేవు. ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఉన్న గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి రూ.50వేల కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఇలాగే కొనసాగితే సంస్థను అంబానీకో, అదానీకో అప్పగించే అవకాశముంది. 30ఏళ్ల క్రితం సింగరేణికి ఇలాంటి దుస్థితి వస్తే అప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయి. కంపెనీని కాపాడుకునేందుకు కార్మికుల హక్కులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా యూనియన్‌ను నడిపిస్తాం.
– కెంగర్ల మల్లయ్య,
టీజీబీకేఎస్ వ్యవస్థాపకుడు


