ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

● పరీక్షకు 1,112 మంది హాజరు ● 32 మంది విద్యార్థుల గైర్హాజరు

మంచిర్యాలఅర్బన్‌: వైద్యకళాశాల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రశాంతంగా ముగి సింది. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష నిర్వహించగా జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,144 మంది కి గాను 1,112 మంది హాజరుకాగా 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 228 మందికి 276 మంది, జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌లో 240 మందికి 236 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 232 మందికి 224 మంది, తెలంగాణ మోడల్‌ స్కూ ల్‌లో 384మందికి 376మంది హాజరయ్యారు. జి ల్లా పరిషత్‌ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ రాములు పరిశీలించారు. ప్రతీ సెంటర్‌ వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేశారు. ఉదయం 11నుంచి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించారు. 1.30గంటల తర్వాత పరీక్షా కేంద్రాల గే ట్లు మూసివేశారు. నీట్‌ రాసేందుకు వచ్చిన విద్యార్థులతోపాటు వారి కుటుంబసభ్యులు వెంట వచ్చా రు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేంత వరకు ధైర్యం నింపు తూ అక్కడే ఉన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి న మహిళలు విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేదాకా కేంద్రాల వద్దే ఉన్నారు. నీట్‌ ప్రశాంతంగా ముగిసిందని సిటీ కో ఆర్డినేటర్‌ జైకిషన్‌ ఓజా తెలిపారు.

ఆలస్యంగా వచ్చి నిరాశతో వెనుదిరిగి..

నిర్దేశిత సమయానికంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థి వెనుదిరిగిన ఘటన జిల్లా పరి షత్‌ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో చోటు చే సుకుంది. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలకు చెందిన ఆడెపు మల్లేశ్‌ కుమార్తె అశ్విత ఆలస్యంగా కేంద్రానికి రావడంతోపాటు ఆధార్‌కార్డు మరిచిపోయింది. ఆధార్‌కార్డు కోసం తండ్రితో ఇంటికి వెళ్లి తి రిగి కేంద్రానికి 1.40కి చేరుకుంది. 1.30 గంటలకే గేట్‌ మూసి వేయడం.. సిబ్బంది అనుమతించకపోవడంతో తండ్రితో కలిసి వెనుదిరిగి వెళ్లిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement