స్వీయ గణనలో పాల్గొన్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనలో పాల్గొన్న ఎమ్మెల్యే

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

పాతమంచిర్యాల: జనాభా లెక్కల స్వీయ గణనను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఆదివారం కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సమక్షంలో తన నివాసంలో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ప్రజలంతా ఈ ప్రక్రియలో పాల్గొని కచ్చితమై న సమాచారాన్ని అందించాలని కోరారు. సీపీవో పాపయ్య, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ధర్ని మధుకర్‌, డీవైఎస్వో రాజేందర్‌ తదితరులున్నారు.

రోడ్డు విస్తరణ అనివార్యం

లక్సెట్టిపేట: పట్టణంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ అనివార్యంగా మారిందని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. స్థానిక విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఊత్కూర్‌ చౌరస్తా నుంచి బస్టాండ్‌ వరకు ప్రధాన రోడ్డు విస్తరణకు గతంలో నిర్ణయించిన 80 అడుగులకు తగ్గేది లేదని పేర్కొన్నారు. రోడ్డుపైకి వచ్చిన భవనాలను యజమానులు తొలగించుకునేందుకు ఈనెల 6వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈనెల 7న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement