పాతమంచిర్యాల: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్‌లో బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి హనుమంతరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను సద్విని యోగం చేసుకోవాలని, క్రీడల్లో శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేశ్‌గౌడ్ ప్రోత్సాహంతో ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల క్లబ్, వీవీ బ్యాడ్మింటన్ అకాడమీ సహకారంతో ఉదయం శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అతిథులు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, ఏడీఈ గోపాల్, డాక్టర్ శ్రీనివాస్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అడ్వైజర్ కృష్ణ, వీవీ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వివేకవర్ధన్, జయదేవ్, సురేశ్, సీనియర్ క్రీఽడాకారులు పాల్గొన్నారు.


