‘జనాగ్రహ సభ విజయవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘జనాగ్రహ సభ విజయవంతం చేయాలి’

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

మంచిర్యాలటౌన్‌: హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఈ నెల 10న బీజేపీ ఆధ్వర్యంలో ని ర్వహించనున్న జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి కోరా రు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆ విష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తీసుకువచ్చిన డీలిమిటేషన్‌ బిల్లును కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయన్నారు. ఈ అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పాపారావు, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌, నాయకులు దుర్గం అశోక్‌, ఎనగందుల కృష్ణమూర్తి, కోడి రమేశ్‌, కమలాకర్‌రావు, దార కళ్యాణి, రంగ శ్రీశైలం, సత్రం రమేశ్‌, కుర్రె చక్రవర్తి, డేగ బాపు, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement