రైల్వే లోకోస్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైల్వే లోకోస్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

బెల్లంపల్లి: రైల్వేలో పని చేస్తున్న లోకోస్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ బెల్లంపల్లి బ్రాంచ్‌ చైర్మన్‌ నాగరాజు, కార్యదర్శి సాంబశివుడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం రైల్వేస్టేషన్‌ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతకాలంగా లోకో లాబీ రన్నింగ్‌ స్టాఫ్‌ పలు సమస్యలతో సతమతం అవుతున్నారని తెలిపారు. ఫాగ్‌ డివైస్‌, డేటానేటర్స్‌ లోకోలో ప్రవేశపెట్టాలని తెలిపారు. 120 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వాలని, లోకోలో ఉన్న సీసీ కెమెరాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకో పైలట్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, రైల్వే కార్మికులు, మజ్దూర్‌ యూనియన్‌ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement